● కలెక్టర్ సత్యశారద
వర్ధన్నపేట/హసన్‌పర్తి: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళి కలో భాగంగా ఆదివారం బీమారంలో నిర్వహిస్తు న్న వర్ధన్నపేట బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మమేకమై వారి చదువు, పరీక్షల సన్నాహాలు, హాస్ట ల్ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదలతో చదువుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే మంచి ఫలి తాలు సాధించవచ్చన్నారు. ఒత్తిడికి లోనుకాకుండా సానుకూల ధృక్పధంతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థ్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అ న్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూ చించారు. డీబీసీడీఓ పుష్పలత, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం: విద్యార్థులు పరీక్షల సమయంలో భయం వీడాలని, సమర్థవంతంగా ఎదుర్కొంటేనే విజయాన్ని సాధించగలుగుతారని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు అనేవి జీవితంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని ముగింపు కాదన్నారు. అధిక ఆందోళన, భయంతో విద్యార్థుల ప్రతిభకు భంగం కలుగుతుందని ప్రశాంతమైన మనస్సుతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. పరీక్షల సమయంలో సరైన ఆహారం, నిద్ర, తేలికపాటి వ్యాయామం ఎంతో అవసరమన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలపై దృష్టి సారించాలని, సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ ఫ్లోరెన్స్, మండల ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, ప్రత్యేకాధికారి నీలిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


