కాళోజీ సెంటర్/గీసుకొండ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల పరీక్ష పూర్తయిందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉప సంచాలకుడు తుమ్మ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఉల్లాస్ వయోజన విద్యతో నిరక్షరాస్యులైన మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులను చేయడమే లక్ష్యంగా ఉల్లాస్ కార్యక్రమం రూపొదించబడిందన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలోని సెర్ఫ్, మెప్మా, విద్యాశాఖ సమన్వయంతో ఎస్‌హెచ్‌జీ సంఘాల్లో పనిచేస్తున్న గ్రామ సమైఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, వీఓఏ, ఆర్‌పీలు, సీఆర్‌పీల పర్యవేక్షణలో ఆదివారం పరీక్ష నిర్వహించగా 82,499 మందికి గాను 70,853 హాజరయ్యారన్నారు. అలాగే గీసుకొండ మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన పరీక్ష కేంద్రాలను రమేష్‌రెడ్డి సందర్శించారు. మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్, టాస్ ఎడ్యుకేషన్ అధికారి సదానందం, రాజిరెడ్డి, సర్పంచులు వీరగోని రాజ్‌కుమార్, పేర్ల శ్రవణ్, బోడకుంట్ల మానస ప్రకాష్, తిరుమలరెడ్డి అర్పిత దిలీప్, సీసీలు, వీఓలు, తదితరులు పాల్గొన్నారు.


