కాశిబుగ్గ: పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులు ఉన్నత శి ఖరాలను అధిరోహిస్తారని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌తోపాటు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ ప్రభు త్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యకు ప్రాధాన్యం ఉందన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ మధ్య తే డా లేదని, నైపుణ్యమే విజయానికి మూలమన్నా రు. కార్యక్రమంలో ఈవీ శ్రీనివాసరావు, ప్రిన్సిపా ల్ బైరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.


