కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్ సెనెట్ సమావేశాన్ని ఈనెల 30న (సోమవారం) ఉదయం 11గంటలకు పరిపాలనా భవనంలోని సెనెట్ హాల్‌లో నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం శనివారం తెలిపారు. ఈసమావేశంలో యూనివర్సిటీ 2026–27 అంచనా బడ్జెట్‌ను, 2025–2026 వార్షిక నివేదికను ప్రవేశపెడతారని పేర్కొన్నారు. వీటిపై చర్చించి సెనెట్ సభ్యులు ఆమోదిస్తారని తెలిపారు. మాజీ వీసీలు, అకడమిక్ సెనెట్ సభ్యులు, కేయూ పాలకమండలి సభ్యులు, వివిధ విభాగాల డీన్‌లు, ప్రత్యేక అహ్వానితులుగా యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొంటారని తెలిపారు.


