● డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్
ఖానాపురం: చట్టాల అమలు ప్రతీ అధికారి బాధ్యత అని వరంగల్ రూరల్ డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్ అన్నారు. తెలంగాణ అటవీశాఖ, టీజీఎఫ్‌డీసీ సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్–1 అధికారుల శిక్షణ కార్యక్రమం గురువారం పాకాలలో ముగిసింది. పాకాల అడవుల్లో ట్రెక్కింగ్, నీటిగుంతలు, నైట్‌క్యాంపింగ్ పరిశీలన, జీవవైవిధ్య పార్కు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పక్షులను తిలకించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ శిక్షణ సమయంలో ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలన్నారు. వణ్యప్రాణుల రక్షణకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని, వన్యప్రాణులను వేటాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎఫ్‌ఓ విశాల్ బత్తుల, ఎఫ్‌ఆర్వో పుప్పాల రవికిరణ్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.


