● అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి
వర్ధన్నపేట: పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి పోషకాహారం తీసుకోవాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్యశిబిరం నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి తరుణ్‌చంద్ర, వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్‌కుమార్, వైస్ చైర్‌పర్సన్ నేతావత్ షీభారాణి, వార్డు కౌన్సిలర్లు బానోతు జ్యోతి, నూనావత్ కమిలి, మాలోతు దేవేందర్, చిలువేరు రమ, తిరుపల్లి వాణి, డీఎంసీ రేణుక పాల్గొన్నారు.


