సంగెం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగేలా సిబ్బంది పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. సంగెం పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మామిడి మొక్క నాటారు. అనంతరం స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ప్రజల జీవనవిధానం, నేరాలు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను ఇన్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది పనితీరు, బీట్ వ్యవస్థ, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టుకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, విధి నిర్వహణలో అలసత్వం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై కె.వంశీకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
సంగెం పోలీస్‌స్టేషన్ తనిఖీ


