కాజీపేట రూరల్ : ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


