హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చామంతిపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రోహిత్ ఉభయ దాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, కాసం పుల్ల య్య వస్త్ర దుకాణం అధినేత కాసం నమశ్శివాయ దేవాలయానికి 16 ఎల్‌ఈడీ లైట్లను అందజేశారు. కార్యక్రమంలో దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్, వాసవీ కబ్ల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు.


