క్షయ రహిత జిల్లా కోసం కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

క్షయ రహిత జిల్లా కోసం కృషి చేయాలి

Mar 25 2026 7:51 AM | Updated on Mar 25 2026 7:51 AM

క్షయ రహిత జిల్లా కోసం కృషి చేయాలి

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

ఆత్మకూరు: క్షయ రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాఽధి దినోత్సవం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్టులతో వైద్య శిబిరం నిర్వహించారు. 630 మంది రోగులకు వివిధ సంస్థల సహకారంతో న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేశారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ రెండో దశ కార్యక్రమంలో భాగంగా వంద రోజుల క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. హైరిస్క్‌ ఉన్న గ్రామాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు విరివిగా జరపాలన్నారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో 25 హైరిస్క్‌ గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో 252 మందికి నిక్షయ్‌ పోషణ్‌ యోజనద్వారా ప్రతీ నెల రూ.1,000 ఆరు నెలల పాటు అందించనున్నట్లు తెలిపారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు, నివారణ మార్గాలను వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణ, సర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరిరాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ రుబీనా, మండల వైద్యాధికారిణి డాక్టర్‌ స్పందన, జిల్లా మాస్‌మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement