నా భర్త పడకంటి రమేష్ ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా 2004 నుంచి 2025 వరకు కాంట్రాక్ట్ బేసిస్‌లో విధులు నిర్వర్తించాడు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ నియామకాల్లో ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ –2 ఉద్యోగానికి ఆయన ఎంపికయ్యాడు. ఈ సంవత్సరం జనవరి నెలలో 27న బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించాడు. మరణించిన మూడు రోజుల తర్వాత డీఎంఈ కార్యాలయం, హైదరాబాద్ నుంచి పోస్టు ద్వారా ఉద్యోగానికి ఎంపికై నట్టు ప్రభుత్వ ఉత్తర్వు వచ్చింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. విద్యార్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించండి.
– పడకంటి పద్మశ్రీ, శంభునిపేట, వరంగల్
పారదర్శకత పాటించాలి
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందించే వాహన స్కీం మంజూరులో పారదర్శకత పాటించాలి. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో గ్రామ కమిటీ, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర అన్యాయం జరిగింది. న్యాయం కోసం ఎస్సీ కమిషన్‌ను సంప్రదించా. ప్రస్తుతం ఆ కేసు ఎస్సీ కమిషన్ విచారణలో ఉంది. నేను హైదరాబాద్‌లో జోమాటో డెలివరీ పార్టర్న్‌గా పనిచేస్తున్నా.
– బిర్రు సురేందర్, అప్పల్‌రావుపేట, నెక్కొండ


