నాకు 77 సంవత్సరాలు. నా భర్త మరణించాడు. నాకు వారసత్వంగా వచ్చిన 5 ఎకరాలను నా కుమారుడికి ఇచ్చా. నా కుమారుడు ఆర్టీసీ ఉద్యోగి. దురదృష్టవశాత్తు అతడు మరణించాడు. ఆ తర్వాత పింఛన్‌తో పాటు భూమిని నా కోడలు తీసుకుని నన్ను వేధిస్తోంది. నా పోషణ నిమిత్తం న్యాయం చేయాలి.
– ఎన్.పద్మ, మందపల్లి, గిర్నిబావి
ఎండ తీవ్రతతో అంగన్‌వాడీల సమయాన్ని మార్చాలి
అద్దె భవనాల్లో సరైన వసతులు లేవు. ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలో అంగన్ వాడీ కేంద్రాల సమయాన్ని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మార్చాలి. మే 1వ తేదీ నుంచి 31 వరకు టేక్‌హోం రేషన్ ఇచ్చే విధంగా అనుమతి ఇవ్వాలి.
– అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్,
వరంగల్ జిల్లా


