భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన

Mar 23 2026 10:01 AM | Updated on Mar 23 2026 10:01 AM

భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ నేడు మాజీ వీసీ యాదిసభ వేయిస్తంభాల ఆలయం, కోటలో పార్కర్‌ సందడి

హన్మకొండ కల్చరల్‌ : వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, అర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన వ్యాపారవేత్త డాక్టర్‌ శ్రీనివాస్‌, బాలజనని దంపతులు పుష్పార్చనకు దాతలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్‌ డాక్టర్‌ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్త తొనుపునూరి వీరన్న, సిబ్బంది పర్యవేక్షించారు.

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నేడు (సోమవారం) గ్రీవెన్స్‌ సెల్‌ను నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు.

కేయూ క్యాంపస్‌: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ ఎన్‌.లింగమూర్తి యాది సభను సోమవారం జర్నలిజం సెమినార్‌హాల్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పూలే ఆశయ సాధనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ సంగాని మల్లేశ్వర్‌ తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే యాదిసభకు హాజరుకావాలని ఆయన కోరారు.

హన్మకొండ కల్చరల్‌/ఖిలా వరంగల్‌ : వేయిస్తంభాల ఆలయాన్ని యూకే నుంచి వచ్చిన ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ రైటర్‌ రాబర్ట్‌ పార్కర్‌ ఆదివారం సందర్శించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను యూకే, ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం రాబర్ట్‌ పార్కర్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ ఆహ్వానించింది. అసిస్టెంట్‌ టూరిజం ఆఫీసర్‌ డాక్టర్‌ కుసుమ సూర్యకిరణ్‌ ఆలయ చరిత్రను వివరించారు. అలాగే రాబర్ట్‌ పార్కర్‌ వరంగల్‌ కోటలోని తూర్పుకోట, పడమర కోట, శృంగార బావి, కళాతో రణం, ఖుష్‌మహల్‌ తదితర ప్రాంతాలను సందర్శించి కాకతీయుల కళాసంపద విశిష్టతను, పర్యాటక ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. సౌండ్‌ అండ్‌ లైట్లు ఇన్‌చార్జ్‌ విజయ్‌, కళ్యాణ్‌, కేంద్ర పురావస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement