నాణ్యమైన భోజనం అందించాలి
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు అన్నారు. ఆదివారం మండలంలోని ఇల్లంద కస్తూర్భాగాంధీ పాఠశాలలో పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వంట కార్మికులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి దుగ్గొండి మండలం రూ.1,500, రెండో బహుమతి వర్ధన్నపేట మండలం రూ.1,000, మూడో బహుమతి పర్వతగిరి మండలం రూ.500 బహుమతులు గెలుచుకున్నట్లు డీఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని నిత్యం పరిశీలిస్తూ నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలన్నారు. గతంలో కంటే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కరుణశ్రీ,, వివిధ మండలాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
డీఈఓ రంగయ్యనాయుడు


