సింహగర్జన సభను విజయవంతం చేయాలి
నర్సంపేట: ఓసీ సింహగర్జన బహిరంగ సభకు రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు రెడ్డి సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం అధ్యక్షుడు కంది గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, నూతన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్మదాపురం, మధిర, బుధరావుపేట, గోపాలపురం, చెన్నారావుపేట, ముదిగొండ గ్రామాల సర్పంచ్‌లుగా ఎన్నికై న వారిని జైపాల్‌రెడ్డితో పాటు జగిత్యాల జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మొట్ల వెంకటరమణారెడ్డి, నర్సంపేట అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ పున్నం రవీందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అండ్రు రాజేంద్రప్రసాద్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 11వ తేదీన నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది గోపాల్‌రెడ్డి, ఎర్ర యాకుబ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, మొట్ల లావణ్య, గోగుల శ్రీనివాస్‌రెడ్డికోమల, కటుకూరి వీరారెడ్డి, పరుపాటి పద్మారఘుపతిరెడ్డి, శ్వేతాచైతన్యరెడ్డి, పొన్నం రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


