ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైంది
● ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
సంగెం: ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని, తరగతి గదుల్లోనే దేశభవిష్యత్‌ను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం సంగెం మండలంలోని లోహిత జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన నూకల అంజివర్ధన్‌రెడ్డి ఆత్మీయ సన్మానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు విధి నిర్వహణను అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. ఉద్యోగ విరమణ పొందిన అంజివర్ధన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. విధుల్లో ఉన్నప్పుడు చేసిన పనులే గుర్తింపునిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ వరంగల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రవీందర్‌రెడ్డి, మహేందర్, యాకూబ్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, గాఫార్, విజయ్‌కుమార్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.


