రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నెక్కొండ: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.సోమయ్య డిమాండ్ చేశారు. పెన్షన్ డేను పురస్కరించుకొని మండల కేంద్రంలోని పెన్షన్ భవనంలో శుక్రవారం నకారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెక్కొండ శాఖ యూనిట్ అధ్యక్షుడు గటిక మల్లయ్య అధ్యక్షతన జరిగిన స మావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ పెండింగ్ బి ల్లులు, కరువు భత్యం, హెల్త్ కార్డులు అందించాలన్నారు. నకారా చేసిన పోరాటంతోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, సంక్షేమం పథకాలు అందుతున్నాయన్నారు. పెన్షన్‌దారులు సంఘటితంగా పోరాడి తమ హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. అనంతరం ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ ఐలయ్య రిటైర్డ్ ఉద్యోగుల కు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో నెక్కొండ యూనిట్ గౌరవ అధ్యక్షుడు ఇనుగాల ఉ పేందర్‌రెడ్డి, కార్యదర్శి ఎస్‌ఏ మొహినోద్దీన్, ఆర్థిక కార్యదర్శి కె.శ్రీహరి, కార్యవర్గ సభ్యులు బి. రత్న య్య, వి. పరమేశ్వరయ్య, పెన్షనర్లు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సోమయ్య


