పల్లెల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్
కాజీపేట అర్బన్: గ్రామీణ స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు పాడి రైతులకు నగదు లావాదేవీలను సులభతరం చేయడానికి మైక్రో ఏటీఎంలు ఉపయోగపడతాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బుధవారం డీసీసీబీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాబార్డ్ సీజీఎం ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. బ్యాంకు నిర్వాహణ పని తీరు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జీఎం ఉష శ్రీ, డీజీఎం అశోక్ పాల్గొన్నారు.


