విధుల్లో అలసత్వం వహించొద్దు
● డీసీపీ అంకిత్‌కుమార్
ఖానాపురం/దుగ్గొండి: పోలీస్ అధికారులు విధుల్లో అలసత్వం వహించొద్దని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. మంగళవారం ఖానాపురం, దుగ్గొండి మండలాల్లోని పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో పట్టుకున్న వాహనాలు, సిబ్బంది యూనిఫాంలు, ఆయుధాలను తనిఖీ చేసి సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. చట్టవ్యతిరేఖ కార్యక్రమాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, రూరల్ సీఐ సాయిరమణ, ఎస్సైలు రఘుపతి, రణదీర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
జీవన ఎరువు
తయారీపై శిక్షణ
దుగ్గొండి: మండలకేంద్రంలోని రైతువేదికలో జాతీయ ఆహార భద్రత సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జీవన ఎరువు తయారీపై శిక్షణా శిబిరం నిర్వహించారు. నేలలోని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించడానికి జీవన ఎరువులు ఉపయోగపడే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్‌టెంట్ సారంగం మాట్లాడారు. పశువుల ఎరువులో ఎకరాకు 2 కిలోల పీఎస్‌బీని కలిపి కలియ చల్లాలన్నారు. జీవన ఎరువులను ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం సాధ్యంకావడంతో పాటు నేల ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్యామ్, టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
రాయపర్తి: ఇటీవల సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో రాయపర్తి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ సరిత తెలిపారు. మంగళవారం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఓవరాల్ చాంపియన్‌షిప్ జోన్‌లో నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. చెస్‌లో దిలీషా, హ్యాండ్ బాల్ పోటీల్లో కీర్తన, వర్షిణితేజ, చందన, వర్షిత, ఖోఖోలో లాస్యనందిని, మన్వితలు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయా విద్యార్థినులు ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు..
సంగెం: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు మండలంలోని మొండ్రాయి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు గూడ చిన్ను, బైరి లక్ష్మిప్రసన్న, గుగులోత్ ఉమేశ్వరీలు ఎంపికై నట్లు పీడీ ముఖర్జీ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను హెచ్‌ఎం విజయ, ఉపాధ్యాయబృందం, గ్రామస్తులు అభినందించారు.
రాష్ట్ర అసోసియేట్
అధ్యక్షుడిగా రియాజొద్దీన్
గీసుకొండ: గీసుకొండ మండల తహసీల్దార్ ఎండీ.రియాజొద్దీన్ రెవె న్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈమేర కు సంఘం నాయకులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేఎంటీ, గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు మండల ప్రజల సమస్యలను పరిష్కరించేవిధంగా సేవలందించారు. ఆయన నియామకంపై కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి కొమురారెడ్డి, నాయకులు ఎలగొండ ప్రవీన్, బెజ్జాల కుమారస్వామి, కోదండపాణి, గోపాల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
విధుల్లో అలసత్వం వహించొద్దు
విధుల్లో అలసత్వం వహించొద్దు


