యాజమాన్య పద్ధతులు పాటించాలి
● జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్
పర్వతగిరి: రైతులు అరటిసాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధిలో భాగంగా మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో సంగని ఐలయ్య వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం అరటి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అరటి రైతులకు అందిస్తున్న పథకాలు, అరటిలో నాణ్యత పెంపొందించుటకు మేలైన యాజమాన్య పద్ధతులపై వివరించారు. అరటి రైతులు ఫ్రూట్ బంచ్ కవర్స్ వాడడం వల్ల అరటి నాణ్యత పెరిగి అధిక ధర రావడానికి అవకాశం ఉంటుందన్నారు. వర్ధన్నపేట డివిజన్ ఉద్యాన అధికారి సీహెచ్ రాకేష్ మాట్లాడుతూ ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోటలు, కూరగాయాలు, ఆయిల్ ఫామ్, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన రాయితీ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి యు.రాజర్షి, వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, కంపెనీ ప్రతినిధులు సాగర్, సతీష్, విక్రమ్, శివమణి, వినోద్, సర్పంచ్‌లు గడుదుల రమేష్, గుగులోతు కిషన్, రైతులు పాల్గొన్నారు.


