విపత్తులో ప్రజలు.. కాపాడిన రెస్క్యూ టీమ్స్
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మాక్‌డ్రిల్‌ను పరిశీలిస్తున్న బల్దియా కమిషనల్ చాహత్ బాజ్‌పాయ్
వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలను చూపిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది
● ఆకట్టుకున్న మాక్‌డ్రిల్
● పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
హన్మకొండ: ‘వరదలు వచ్చినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి? వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించడం ఎలా? పునరావాస కేంద్రానికి తరలించడం ఎలా?’ అనే అంశాలపై ఎస్‌డీఆర్‌ఎస్, అగ్నిమాపక శాఖ ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌డ్రిల్ ఆకట్టుకుంది. హనుమకొండలోని సమ్మయ్యనగర్, రెడ్డిపురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. సమ్మయ్య నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, ఎన్‌సీసీ, రెడ్‌క్రాస్, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందికి వరద సహాయక చర్యలను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్ రెడ్డి వివరించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి రవిచౌహాన్ ఆధ్వర్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం సహాయక చర్యలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ సుధీర్ బాహల్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్ మాన్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, తహసీల్దార్లు రవీందర్‌రెడ్డి, కిరణ్ కుమార్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ ఫైర్ ఆఫీసర్ శంకర్ లింగం, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మధుసూదన్, ఏసీపీలు నరసింహారావు, సత్యనారాయణ, రెడ్‌క్రాస్ ఈసీ మెంబర్ శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
విపత్తులో ప్రజలు.. కాపాడిన రెస్క్యూ టీమ్స్
విపత్తులో ప్రజలు.. కాపాడిన రెస్క్యూ టీమ్స్
విపత్తులో ప్రజలు.. కాపాడిన రెస్క్యూ టీమ్స్


