వరంగల్
న్యూస్‌రీల్
వరంగల్‌లో ‘హైదరాబాద్’ అభివృద్ధి
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పల్లె పరిపుష్టికి బాట..
పల్లెకు ఏ ప్రజాప్రతినిధి, ఏ అధికారి వచ్చినా.. సభకు అధ్యక్షత వహించేది గ్రామ సర్పంచే. పీఆర్ వ్యవస్థ ఏర్పాటై 66 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
వాతావరణం
జిల్లాలో ఉదయం మంచుకురుస్తుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
నర్సంపేటలో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, పక్కన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, ప్రకాశ్‌రెడ్డి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సారయ్య
అభివాదం చేస్తున్న సీఎం
రేవంత్‌రెడ్డి
నర్సంపేట సీఎం సభ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
హెలిపాడ్ వద్ద రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం ● పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం ● పోలీసుల భారీ బందోబస్తు
సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్ : నర్సంపేటలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి నర్సంపేట వచ్చారు. శుక్రవారం సాయంత్రం 3.32గంటలకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రజాపాలన–విజయోత్సవ సభావేదిక వద్దకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డుపొడువునా ప్రజలకు అభివాదం తెలుపుతూ సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా సభా వేదిక వద్ద సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికల్లో యువత, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నర్సంపేట డివిజన్‌లోని ఆరుమండలాలనుంచే కాకుండా ఉమ్మడి జిల్లానుంచి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల రాకతో సభాప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.రియాజ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ రాజుపేట గ్రామ శివారులోని హెలిపాడ్ వద్ద దిగింది. హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన సీఎంకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి అనసూయ( సీతక్క), కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు.
హైదరాబాద్ నగరం మాదిరిగా వరంగల్ నగరంలో అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఆనాడు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్ సింగ్ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లే తెలంగాణకు పెద్ద దిక్కయ్యాయి. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆరేడు, మహారాష్ట్రలో పది నుంచి 12, కర్ణాటకలో ఏడెనిమిది ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. కానీ తెలంగాణలో పదేళ్లు పాలన చేసినోళ్లకు మరీ ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో, జ్ఞానోదయం ఇవ్వలేదో కనీసం రెండో ఎయిర్‌పోర్టు తేవాలనే ఆలోచన చేయలేదు’ అని సీఎం అన్నారు. అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రులు సురేఖ, సీతక్కతో మాట్లాడి హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో వరంగల్ నగరంలోనూ అన్ని ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుగానే ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ తీసుకురావాలని నిర్ణయించామని, హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఉంటే వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ ఉండాలని రైతులను ఒప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరు వరకు పౌర విమానయాన శాఖకు భూమి అప్పగించనున్నామని తెలిపారు. మార్చి 31లోపు వరంగల్‌లో ఈ నిర్మాణ పనులన్నీ ప్రారంభిస్తామని సీఎం హామీనిచ్చారు. కొత్త సంవత్సరంలో మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకునేందుకు మళ్లీ వస్తానని అన్నారు.
వచ్చే ఏప్రిల్‌లో నర్సంపేటకు మరో 3,500 ఇళ్లు..
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విజ్ఞప్తి మేరకు వచ్చే ఏప్రిల్ ఆర్థిక సంవత్సరంలో నర్సంపేట నియోజకవర్గానికి 3వేలనుంచి 3,500 ఇళ్లు మంజూరు చేసే బాధ్యత గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటున్నారని వేదిక మీదినుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. ‘కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్‌లంటూ మోసగించారు. వరంగల్ ఇందిరమ్మ కాలనీలో గుడిసెలు ఉండొద్దని కాలనీ కాలనీనే కూలగొట్టిండు. చివరకు ఏమైంది ఇల్లు పీకి పందిరేసికున్నట్టు పేదోళ్ల బతుకే ఆగమైంది. ఈ మేధావి గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు కోడి కోయాలి.. కల్లు పొయ్యాలి...దావత్ ఇవ్వాలి అని అడిగిండు వరంగల్ సోదరులను. వరంగల్ వాసులు మంచోళ్లు కావడంతో ఆయన మాయమాటలకు మోసపోయిర్రు. ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వాళ్లకు సలాకులు కాల్చి వాతపెట్టాలి. మంచి చేసే వాళ్లను ఎన్నుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
ఔటర్ రింగ్ రోడ్డు, యూజీడీ తీసుకొస్తున్నాం
కొత్త ఏడాది మేడారం జాతరకు మళ్లీ వస్తా
నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వరంగల్
వరంగల్
వరంగల్
వరంగల్
వరంగల్
వరంగల్


