ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
నెక్కొండ: గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం నెక్కొండలోని నామినేషన్ క్లస్టర్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు సమర్పిస్తున్నారో లేదో చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జెడ్పీసీఈఓ రాంరెడ్డి, ఎన్నికల అధికారులు సదానందం, మహమూద్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ఖానాపురం: ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు బాల మాయాదేవి, కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని ఖానాపురం, బుధరావుపేటలోని నామినేషన్ కేంద్రాలను శుక్రవారం వారు పరిశీలించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలను సజావుగా సాగడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, మండల స్పెషల్ ఆఫీసర్ సౌజన్య, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ అద్వైత, ఎంపీఓ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


