బాల్య వివాహాలు చట్ట విరుద్ధం
వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి
వరంగల్ చౌరస్తా: బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, ఆ వివాహాల నిర్మూలనలో పురోహితుల పాత్ర కీలకమని వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి అన్నారు. వరంగల్ గోవిందరాజుల ఆలయంలో బాల్యవివాహాల నిర్మూలన కోసం షేర్ స్వచ్ఛంద సంస్థ, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమన్వయంతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమణి హాజరై మాట్లాడుతూ 18 సంవత్సరాల్లోపు బాలికలు, 21 సంవత్సరాల్లోపు బాలురకు వివాహాలు చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. 27వ డివిజన్ కార్పొరేటర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ వసుధ, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, ఆలయ చైర్మన్ మరిపల్లి సంజీవరావు, ఆలయ ప్రధాన అర్చకుడు వరయోగుల శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


