ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఆత్మకూరు: ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు దేవేందర్ సూచించారు. మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. కటాక్షపూర్‌లోని చెక్‌పోస్టును పరిశీలించారు. ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఆడిటర్ అశోక్, ఫ్లయింగ్ స్క్వాడ్ బాబురావు పాల్గొన్నారు.
ఈసీ నిబంధనలను పాటించాలి
దామెర: మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన నామినేషన్ సెంటర్‌ను జిల్లా వ్యయ పరిశీలకుడు దేవేందర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల వ్యయ వివరాలు రిటర్నింగ్ అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఆయన వెంట సహాయ ఎన్నికల పరిశీలకుడు రవిప్రసాద్, ఎండీపీఓ గుమ్మడి కల్పన, సిబ్బంది తదితరులు ఉన్నారు.


