రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలి

Dec 6 2025 7:20 AM | Updated on Dec 6 2025 7:20 AM

రిటైర

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలి

కాళోజీ సెంటర్‌: రిటైర్డ్‌ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ బకాయిలు గ్రీన్‌ చానల్‌ ద్వారా చెల్లించాలని కోరుతూ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ బకాయిలు సాధన సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌కు శుక్రవారం హనుమకొండలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బకాయిల సాధన సమితి ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకులు శ్రీధర్ల ధర్మేంద్ర, కడారి భోగేశ్వర్‌, గఫార్‌, మేకరీ దామోదర్‌, ఇంద్రసేనారెడ్డిలు మాట్లాడుతూ ప్రస్తుత ఐఎఫ్‌ఎంఎస్‌ ద్వారా కాకుండా గ్రీన్‌చానల్‌ ద్వారా చెల్లించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికై న రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు.

రూ.4.38లక్షల నగదు పట్టివేత

నెక్కొండ: మండలపరిధిలోని చంద్రుగొండ క్రాస్‌ రోడ్డు వద్ద ఓ వ్యక్తి దగ్గర నుంచి రూ.4.38 లక్షల నగదు పట్టుకున్నట్లు ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ లీడర్‌, డీటీ రవికుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతలపాడు మండలం గుండాల గ్రామానికి చెందిన గాందర్ల సతీశ్‌కుమార్‌ ములుగుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ వాహనాన్ని తనిఖీ చేయగా ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తుండటంతో సీజ్‌ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్‌ రమేశ్‌, జీపీఓ రజనీకాంత్‌, వీడియో గ్రాఫర్‌ మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చట్ట విరుద్ధం

వరంగల్‌ చౌరస్తా: బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, ఆ వివాహాల నిర్మూలనలో పురోహితుల పాత్ర కీలకమని వరంగల్‌ జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి అన్నారు. వరంగల్‌ గోవిందరాజుల ఆలయంలో బాల్యవివాహాల నిర్మూలన కోసం షేర్‌ స్వచ్ఛంద సంస్థ, జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సమన్వయంతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమణి హాజరై మాట్లాడుతూ 18 సంవత్సరాల్లోపు బాలికలు, 21 సంవత్సరాల్లోపు బాలురకు వివాహాలు చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. 27వ డివి జన్‌ కార్పొరేటర్‌ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ వసుధ, షేర్‌ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్‌ శిరీష, ఆల య చైర్మన్‌ మరిపల్లి సంజీవరావు, ఆలయ ప్రధాన అర్చకుడు వరయోగుల శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

పనివేళల మార్పునకు కృషి

నర్సంపేట: ఈ నెలాఖరు కల్లా అన్ని గురుకుల పాఠశాలల పనివేళల మార్పుకు ఆదేశాలు వచ్చేలా కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు నర్సంపేటలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో సందర్శించి పాఠశాల వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణను పర్యవేక్షించి ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు, హెల్త్‌ కార్డులు మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు. గత ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి విజయం సాధించడంలో కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు శ్రీపాల్‌రెడ్డిని ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈదునూరి రవీందర్‌రెడ్డి, నక్కిరెడ్డి మహేందర్‌, హ నుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మండల తిరుపతిరెడ్డి, పలిత శ్రీహరి, అ బ్దుల్‌ గఫార్‌, శాన ఉమామహేశ్వర్‌, పాత శ్యాంప్రసాద్‌, కోడెం సాంబయ్య, శీలం మల్ల య్య, ఓదెల సురేందర్‌, అమ్మ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలి
1
1/1

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement