 
															సీపీఎస్ రద్దు చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళిశ్రీపాల్‌రెడ్డి
విద్యారణ్యపురి: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి సూచించారు. హనుమకొండ జిల్లా పరిషత్ సమావేశ హాల్‌లో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల శాఖల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. టెట్‌పైన ఉపాధ్యాయులు ఆందోళన చెందొద్దని, అతిత్వరలోనే ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపునకు యత్నిస్తున్నట్లు చెప్పారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూటీఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మంద తిరుపతిరెడ్డి, ఫలిత శ్రీహరి, నకిరెడ్డి మహేందర్, బాధ్యులు కోమల్‌రెడ్డి, బెడిదె జగన్మోహన్ గుప్తా, సోమిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్ల ఉపేందర్‌రెడ్డి, కటకం రఘు, ఉమామహేశ్వర్, యాకూబ్‌రెడ్డి, మిర్యాల సతీష్‌రెడ్డి, కొట్టె శంకర్, ఎన్‌వీఆర్ రాజు, మహ్మద్ అబ్దుల్‌గఫార్, సుమాదేవి, అనురాధ, సంధ్య, అర్పిత, శోభారాణి, సరిత, రహమత్, కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జాలి రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
