 
															మోడల్‌స్కూల్స్‌ను విద్యాశాఖలో విలీనం చేయాలి
కాళోజీ సెంటర్: తెలంగాణలోని మోడల్ స్కూల్స్ ను రాష్ట్ర విద్యాశాఖలో విలీనం చేయాలని మోడల్ స్కూల్స్ టీచర్స్ ఐక్యవేదిక నాయకులు కోరారు. ఆదివారం మోడల్ స్కూల్స్ సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశం టీఎస్‌యూటీఎఫ్ సమావేశ మందిరంలో ఎస్.విట్ట ల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు బిరిగల కొండయ్య, అరవింద్ ఘోష్, బత్తిని సత్యనారాయణ గౌడ్, ఆరీఫ్‌లు మాట్లాడుతూ 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐక్యవేదికను రాష్ట్ర వేదికను బలోపేతం చేయడానికి కృషిచేస్తామన్నారు. ఈ సమావేశంలో జీ.రాజశ్రీ, శశికుమారి, సంధ్య, హైమావతి, రుద్రమదేవి, నీలాంద్రి, డి.బాలకిషన్, కిరణ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కొండయ్య

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
