
అవినీతి చేశారు.. బెనిఫిట్స్ ఆగుతాయ్..!
రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న అధికారులే సైబర్ నేరగాళ్ల టార్గెట్
మొదట ఫోన్ పే ద్వారా విడతల వారీగా నిందితుడు రూ.4 లక్షల వరకు బదిలీ చేయించున్నాడు. అనంతరం మరో రూ.ఆరు లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో ఎంవీ ఐ జైపాల్ రెడ్డి చాకచాక్యంగా బ్యాంక్ ఖాతా నంబర్ ఇస్తే బదిలీ చేస్తానని చెప్పాడు. దీంతో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం బసవేశ్వరనగర్‌లోని ఓ బ్యాంక్ ఖాతాను మరుసటి రోజు నిందితుడు పంపించాడు. దీంతో జైపాల్‌రెడ్డి తన అగ్రికల్చర్ లోన్ అకౌంట్ ద్వారా డబ్బులు పంపారు. ఆ వెంటనే బైపాల్‌రెడ్డి బెంగళూరులో ఉన్న తన బంధువులు, ఓ ముఖ్యప్రజాప్రతినిధికి సమాచారం అందించాడు. వారిపాటు పోలీసుల సాయంతో నగదు పంపించిన ఫోన్ పే నంబర్ల ఆధారంగా ఓ సెక్యూరిటీ గార్డు, ఓ డెలివరీ బాయ్‌ని నిందితులుగా గుర్తించారు. బ్యాంక్ ఖాతా కూడా అక్కడే ఏటీఎం సెక్యూరిటీ గార్డుదిగా తేల్చారు. డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వచ్చేవాడు ఎలా ఉంటాడు, నీకు ఎలా పరిచయం అంటూ సెక్యూరిటీ గార్డును ఆరా తీశారు. ప్రతిసారి రూ.50 వేలు నా అకౌంట్‌లోకి వస్తే రూ.ఐదు వేలు ఇచ్చి రూ.45 వేలు తీసుకుంటున్నాడని, ప్రతిసారి ముఖానికి మాస్క్ ధరించి వస్తాడని సెక్యూరిటీ గార్డు ఎంవీఐ బంధువులకు సమాచారమిచ్చారు. తొలిసారిగా అతడి అసలైన ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేశాడని, డబ్బులు డ్రా చేసేందుకు ఆదివారం వస్తున్నాడనడంతో ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేసే ముందు ఈసారి ముఖానికి మాస్క్ తీయమని చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇలా ఆ ఖాతా నుంచి రూ.40 వేల వరకు డ్రా చేసుకుంటున్న సమయంలో ఆ ప్రధాన నింది తుడి ఫొటో అక్కడున్న సీసీ కెమెరాకు చిక్కింది. దీంతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సాక్షి, వరంగల్: రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న అధికారులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వరంగల్ రవాణా శాఖలో ఎంవీఐగా పనిచేస్తున్న జైపాల్‌రెడ్డికి ఏసీబీ పేరుతో ఫోన్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేసిన సైబర్ నేరగాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. తొలుత నిందితుడు వరంగల్ రవాణా శాఖ ఇన్‌చార్జ్ ఆర్టీఓ శోభన్‌బాబుకు ఫోన్ చేసి తాను ఏసీబీ అధికారినని చెబుతూ.. మీ ఆఫీసులో ఎవరు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నారని ఆరా తీశాడు. శోభన్‌బాబు వెంటనే ఎంవీఐ జైపాల్‌రెడ్డిని ఫోన్ కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నాడు. దీంతో మీరు అవినీతికి పాల్పడ్డారు.. మీ బెనిఫిట్స్ అన్నీ ఆగుతాయని జైపాల్‌రెడ్డిని సదరు నిందితుడు బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు.
గతంలోనూ బెదిరింపులు..
గతంలోనూ వివిధ ప్రభుత్వ విభాగాల్లో రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్న ఉద్యోగులను ఏసీబీ అధికారినంటూ బెదిరించి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని తెలిసింది. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బసవేశ్వర పోలీసు స్టేషన్‌లోనూ ఓ డెలివరీ బాయ్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ప్రధాన నిందితుడు తమకు డబ్బు ఆశ చూపి ఫోన్ పే నంబర్లు, బ్యాంక్ ఖాతాలు వాడుకున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఏసీబీ అధికారులకు ఫిర్యాదు
ఏసీబీ అధికారి పేరుతో ఫోన్ చేసి రూ.పది లక్షల వరకు కొట్టేశారంటూ ఎంవీఐ జైపాల్‌రెడ్డి ఏసీబీ అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. వారి సూచనలతో మిల్స్‌కాలనీ ఠాణాలోనూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. గతంలో నెల్లూరులో పనిచేసిన సమయంలో ఏసీబీ కార్యాలయంలోని ఓ హోంగార్డు తరచూ ఫోన్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగితే రెండు, మూడు సార్లు డబ్బులిచ్చి ఆ తర్వాత జైపాల్‌రెడ్డి స్వయంగా రెక్కీ చేసి అతడితోపాటు మరో వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నకిలీ ఏసీబీ అధికారులతో కలకలం
ఇటీవల ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద ఏసీబీ అధికారుల దాడులు, వరంగల్ నగరం ములుగు రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయంలో ఇటీవల సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం.. ఇదే సమయంలో ఏసీబీ అధికారులంటూ రవాణాశాఖ సిబ్బందికి ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. రిటైర్మెంట్ అధికారులే లక్ష్యంగా డబ్బులు డిమాండ్ చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. సైబర్ నేరగాళ్లు కొత్త తరహా పంథా ఎంచుకోవడంతో చాలామంది అధికారులు రిటైర్మెంట్ ముందు మనకు ఎందుకీ తలనొప్పి అంటూ రూ.లక్షల్లో సమర్పించుకొని మిన్నకుండిపోయినట్లు సమాచారం.
ఏసీబీ అధికారులమంటూ ఫోన్‌కాల్స్
వరంగల్ ఎంవీఐకి ఫోన్ చేసి
డబ్బుల డిమాండ్
బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ
చేయడంతో చిక్కిన నిందితులు
బసవేశ్వరనగర్ పోలీసుల అదుపులో ముగ్గురు నేరగాళ్లు

అవినీతి చేశారు.. బెనిఫిట్స్ ఆగుతాయ్..!

అవినీతి చేశారు.. బెనిఫిట్స్ ఆగుతాయ్..!

అవినీతి చేశారు.. బెనిఫిట్స్ ఆగుతాయ్..!