వైన్స్‌ దరఖాస్తులకు నేడు చివరి తేదీ | - | Sakshi
Sakshi News home page

వైన్స్‌ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

Oct 23 2025 9:16 AM | Updated on Oct 23 2025 9:16 AM

వైన్స

వైన్స్‌ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

వైన్స్‌ దరఖాస్తులకు నేడు చివరి తేదీ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ తనిఖీ జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

నర్సంపేట: 2025–27 సంవత్సరానికి వైన్‌షాపుల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు(గురువారం)తో ముగుస్తుందని నర్సంపేట ఎకై ్సజ్‌ సీఐ నరేష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో 22 షాపులకు ఇప్పటి వరకు 711 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆసక్తి గల వారు నేడు(గురువారం) సాయంత్రం 5 గంటలలోపు హనుమకొండలోని డీపీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

నర్సంపేట: పట్టణంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను బుధవారం విజిలెన్స్‌ టీం తనిఖీ చేసి స్టాక్‌ వివరాలను పరిశీలించింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన స్టాక్‌తోపాటు పంపిణీ వివరాలు పరిశీలించగా అన్ని రకాలుగా టాలీ అయ్యాయని విజిలెన్స్‌ టీం సీఐ వసంత్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయీస్‌ సిబ్బంది మామిడాల రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ క్రైం : సాంస్కృతిక కార్యక్రమాలతో పోలీస్‌ జాగృతి కళాబృందం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. పోలీస్‌ జాగృతి కళాబృందం సభ్యులతో సీపీ తన కార్యాలయంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏఏ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను కళాబృందం ఇన్‌చార్జ్‌ ఏఎస్సై నాగమణిని సీపీ అడిగి తెలుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్‌ నేరాలు, రోడ్‌ సేఫ్టీ, మూఢనమ్మకాలు, షీ టీం, డయల్‌–100, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే రీతిలో గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో కథాంశాలతో ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. అదే విధంగా కేవలం కథాంశాలే కాకుండా మూడేళ్లుగా సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు జరిగిన నష్టాలపై ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కళాబృందం కార్యాచరణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఏసీపీ ఎస్‌.బీ 2జాన్‌ నర్సింహులుకు సీపీ సూచించారు. సీపీతో ముచ్చటించిన వారిలో హెడ్‌ కానిస్టేబుళ్లు విలియమ్‌, రత్నయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ పూల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్‌ 14వరకు నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహమాన్‌ పర్యవేక్షించారు. డాక్టర్‌ మంద శ్రీనివాస్‌, శ్రీదేవి అధ్యాపకులు ఉన్నారు.

వైన్స్‌ దరఖాస్తులకు  నేడు చివరి తేదీ
1
1/2

వైన్స్‌ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

వైన్స్‌ దరఖాస్తులకు  నేడు చివరి తేదీ
2
2/2

వైన్స్‌ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement