
ఇద్దరికీ ఒకటే ఆధార్ నంబర్..
● లెంకాలపల్లిలో వెలుగుచూసిన వైనం
● అయోమయంలో విద్యార్థిని తల్లిదండ్రులు
● గతంలో గుండ్లపహాడ్‌లో నూ ఇదేతీరు..
నల్లబెల్లి: ఆధార్‌కార్డులో వ్యక్తి పేరు లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉంటే సవరించుకోవడం సాధారణం. కానీ, ఏకంగా ఒకే నంబర్ ఇద్దరు వ్యక్తుల పేరున ఉంటే ఏం చేయాలో తెలియక తలమునకలవుతున్నారు.. మండలంలోని లెంకాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లెంకాలపల్లి గ్రామానికి చెందిన జన్ను రజిత–సాంబయ్య దంపతుల కుమార్తె దివ్య పెద్దాపూర్ ఎంజేపీ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది. అదే గ్రామానికి చెందిన జన్ను లలిత–కోటి దంపతుల కుమార్తె దివ్య నల్లబెల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. జన్ను లలిత–కోటి కుమార్తె దివ్య వివరాలను నల్లబెల్లి కస్తూర్బా గురుకుల విద్యాలయాల్లో యూడైస్‌లో నమోదు చేసేక్రమంలో ఆధార్ కార్డు నంబర్ 2522 5754 7168 ఎంటర్ చేయగానే జన్ను రజిత–సాంబయ్య కుమార్తె దివ్య వివరాలు వెల్లడవుతున్నాయి. లలిత–కోటి దంపతుల కుమార్తె దివ్య 01–01–2011లో జన్మించగా.. రజిత–సాంబయ్య కుమార్తె దివ్య 22–08–2010న జన్మించింది. కానీ, ఇరువురి పుట్టిన తేదీ ఒకేరోజుగా కార్డులో నమోదు కావడం, ఇరువరికి ఒకే ఆధార్ నంబర్ ఉండడం గమనార్హం. దీంతో సవరణ కోసం స్థానిక ఆధార్ కేంద్రంలో సంప్రదించగా.. హైదరాబాద్‌లోని కేంద్రానికి వెళ్లాలని సూచించడంతో తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. గతంలో ఇలాంటిదే మండలంలోని గుండ్లపహాడ్‌లో సైతం వెలుగు చూడడం పాఠకులకు విధితమే.

ఇద్దరికీ ఒకటే ఆధార్ నంబర్..