
ఆవిష్కరణలకు వేదిక ఇన్‌స్పైర్
కాళోజీ సెంటర్: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన (ఆర్‌ఎస్‌బీవీపీ), డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ప్రాజెక్టు కాంపిటిషన్ (డీఎల్‌ఇపీసీ) ఇన్‌స్పైర్ మనాక్ ఎగ్జిబిషన్ నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 –26 సంవత్సరానికి థీంగా వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధాన అంశాలను ఎంపిక చేసి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్ణయించారు. ఉప థీంలో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు, గ్రీన్‌ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత నమూనా (రిక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్), ఆరోగ్యం, పరిశుభ్రత నీటి సంరక్షణ, నిర్వహణ అనే అంశాలను ఎంపిక చేశారు. జిల్లాలోని సైన్స్, గణిత ఉపాధ్యాయులు 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను సిద్ధం చేయాలి. నవంబర్ ఒకటి నుంచి 30వ తేదీలోపు మూడు రోజులపాటు ఆర్‌ఎస్‌బీవీపీ, ఇన్‌స్పైర్ మనాక్ నిర్వహించాలి.
ఇన్‌స్పైర్ మనాక్ ఆవిష్కరణల ప్రదర్శన..
జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ఇన్‌స్పైర్ అవార్డు మనాక్ విభాగంలో విద్యార్థులు పాల్గొంటారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో సైన్ ఎగ్జిబిట్లను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సైన్స్ ఫెయిర్‌కు ఏడు ఉప అంశాలు ఉన్నాయి. ఆవిష్కరణలకు రూపం ఇవ్వడానికి ఒక్కోవిద్యార్థి ఖాతాలో ఇప్పటికే రూ.10వేల చొప్పున జమ చేశారు. ఇందులో పాల్గొనే విద్యార్థులు, గైడ్ టీచర్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం ఆమోదించి ఎంపిక చేసిన ఆయా టైటిల్ ప్రకారమే తమ ప్రదర్శనలు, ప్రాజెక్టులను సిద్ధం చేయాలి. జిల్లాస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుల్లో 16 ఎగ్జిబిట్లు రాష్ట్రస్థాయిలో పాల్గొంటాయి.
ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయుల
ఎగ్జిబిట్లు..
జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయుల విభాగం కూడా ఉంటుంది. ఆసక్తిగల ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు సాంకేతిక ఆవిష్కరణలు, సృజనాత్మక భోధనా అభ్యసన పరికరాలను ప్రదర్శించవచు. ఈ విభాగం నుంచి కూడా రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు.
సైన్స్ సెమినార్స్..
సైన్స్ ఎగ్జిబిట్లతోపాటు ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై ఈ సైన్స్ ఫెయిర్‌లో సెమినార్ నిర్వహిస్తారు. 6 నుంచి 12 తరగతుల విద్యార్థు పాల్గొంటారు. జిల్లాస్థాయిలో అత్యుత్తమంగా సమర్పించిన ఒక విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎంపికవుతాడు.
ఒకే వేదికపై రెండు కార్యక్రమాలు..
బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనాక్ ఒకే వేదికపై నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు జిల్లాల వారీగా తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా సైన్స్ అధికారులు, సైన్స్, గణిత ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.
నవంబర్‌లో 3 రోజులపాటు నిర్వహణ
6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు అవకాశం
వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ అంశాలు
ఎంపిక
జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తాం..
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఇఆర్‌టీ), బాల వైజ్ఞానిక ప్రదర్శన(ఆర్‌ఎస్‌బీవీపీ) ఆదేశాల మేరకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను నవంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పాఠశాలను ఎంపికచేస్తాం. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాం.
– బి.రంగయ్య నాయుడు, డీఈఓ
బాలశాస్త్రవేత్తల ఆవిష్కరణలకు వేదిక
బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనాక్ అవార్డ్స్ సంయుక్తంగా ఒకే వేదికలో ఒకేసారి నిర్వహిస్తాం. 6 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచనలు, పరిష్కార నైపుణ్యాలు ప్రదర్శించడానికి ఇది ఒక వేదిక. విద్యార్థులు ప్రేరణ పొందడానికి ఈ సైన్స్ ఫెయిర్ దోహదపడుతుంది. నేటి బాలలే రేపటి స్టార్టప్ కంపెనీల స్థాపకులు, నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఇది ఉపయోగపడుతుంది.
– డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి

ఆవిష్కరణలకు వేదిక ఇన్‌స్పైర్

ఆవిష్కరణలకు వేదిక ఇన్‌స్పైర్

ఆవిష్కరణలకు వేదిక ఇన్‌స్పైర్