
పాఠశాలల్లో స్వచ్ఛత పక్షోత్సవాలు
కాళోజీ సెంటర్: విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో స్వచ్ఛత పక్షోత్సవాలు ఈనెల 17న ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 344 ప్రాథమిక పాఠశాలలు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు, 134 ఉన్నతపాఠశాలలతోపాటు గురుకుల పాఠశాలలు, కేజీబీవీల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా విదాశాఖ అధికారి సూచనల మేరకు ఎంఈఓలు, హెచ్‌ఎంలు పక్షోత్సవాలు ప్రారంభించి మొదటి రోజు విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
● 17వ తేదీన పాఠశాలల్లో విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
● 18 నుంచి 21 వరకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
● 22వ తేదీన హరిత దినోత్సవం నిర్వహించాలి. పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించారు.
● 23వ తేదీన పాఠశాలను సమాజానికి చేరువ చేయాలి. స్థానిక ప్రజలు, విద్యావేత్తలతో విద్యార్థులను మమేకం చేయాలి. వారికి స్వచ్ఛత ప్రాముఖ్యత గురించి వివరించాలి.
● 24వ తేదీన హ్యాండ్ వాష్ డే లో భాగంగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మధ్యాహ్న భోజన సమయంలో చేతులను సరిగా కడుక్కోవడం, చేతులను శుభ్రం చేసే విధానాలను విద్యార్థులకు నేర్పించాలి.
● 25వ తేదీన విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించాలి.
● 27వ తేదీన వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించాలి. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి.
● 28వ తేదీన పాఠశాల స్థాయిలో విద్యార్థులతో స్వచ్ఛతపై ఎగ్జిబిషన్ డే నిర్వహించాలి.
● 29, 30వ తేదీల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాఠశాల స్వచ్ఛతపై ప్రణాళికలు రూపొందించాలి.
● 31వ తేదీన స్వచ్ఛత పక్వాడ ముగింపు దినోత్సవం నిర్వహించాలి. గ్రామ ప్రముఖులను ఆహ్వానించాలి. కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు ప్రతిరోజూ పోటీలు నిర్వహిస్తే.. విజేతలకు బహుమతులు అందజేయాలి. స్వచ్ఛత పక్వాడ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలి.
పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన