
ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు పెంచాలి
కమలాపూర్: ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని అంబాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని (పల్లె దవాఖాన) శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్, గత నెలలో జరిగిన ప్రసవాల సంఖ్య, డ్రైడే, సీజనల్ వ్యాధులు, టీబీ, హెచ్‌ఐవీ, లెప్రసీ తదితర వ్యాధుల గురించి అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో విద్యుత్ సరఫరా లేదని, తాగునీటి వసతి, మౌలిక వసతులు కల్పించాలని సిబ్బంది కోరారు. విద్యుత్ శాఖ సిబ్బందిని పిలిపించుకుని విద్యుత్ కనెక్షన్‌కు అవసరమైన అంచనా ఇవ్వాలని కోరారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, వైద్య సిబ్బందికి, పల్లె దవాఖానకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. వైద్యురాలు మానస, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్‌షాపులకు శుక్రవారం రాత్రి 9:35 గంటలకు 895 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు 1,435 దరఖాస్తులు వచ్చాయి. కాగా, శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. గత టెండర్లలో 5,859 దరఖాస్తులకు రూ.117 కోట్ల ఆదాయం ఎక్సైజ్ ఖజానాకు వచ్చింది. 2025–27 సంవత్సరం టెండర్ల ప్రక్రియలో గత టార్గెట్ చేరుకుంటుందా.. లేదా? ప్రభుత్వం దరఖాస్తుల గడువు పొడిగిస్తుందా? అని వేచి చూడాలి.
ధర్మసాగర్: భర్తను హత్య చేసిన భార్యను శుక్రవారం ధర్మసాగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద పెండ్యాలకు చెందిన రాజారపు అశోక్‌కు చిల్పూరు మండలానికి చెందిన యాదలక్ష్మితో 2013లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అశోక్ కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసైన అశోక్‌కు, యాదలక్ష్మికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా అతడు హైదరాబాద్‌లోని ఓ టీస్టాల్‌లో పనిచేస్తున్నాడు. ఈనెల 10న పెద్దపెండ్యాలకు వచ్చాడు. ఈక్రమంలో గురువారం మళ్లీ వీరి మధ్య గొడవ జరిగింది. అనుమానపడడంతో, భర్తను చంపితే ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చని యాదలక్ష్మి తన మెడలోని చున్నీతో ఉరేసినట్లు పోలీసులకు చెప్పింది. అనంతరం ఇంటి నుంచి పారిపోయి రాంపూర్ వెళ్లే దారిలోని కపిల్ వెంచర్‌లో ఎవరికీ కనబడకుండా నిద్రించి ఉదయం రాంపూర్‌కు వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికై నా పారిపోదామనుకుంది. ఈక్రమంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను శుక్రవారం అరెస్ట్ చేశారు. మృతుడి తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో, యాదలక్ష్మి తరఫున బంధువులెవరూ లేకపోవడంతో, ఆమె బెయిల్‌పై వచ్చే వరకు నలుగురు పిల్లలని ధర్మసాగర్ పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. సమావేశంలో సీఐ శ్రీధర్రావు, ఎస్‌ఐ జానీ పాషా, నరసింహరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి రోడ్డులోని శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి భక్తసేవాశ్రమంలో ఈనెల 22 నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభంకానున్నాయని అర్చకుడు గణపతిశర్మ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకుడు, గురుస్వామి టీఆర్ బాలస్రుబహ్మణ్యశర్మ ఽఆధ్వర్యంలో భక్తులకు క్యూలెన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు పెంచాలి