
రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కృషి
● రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్
ప్రొఫెసర్ అర్జునరావు
ఆత్మకూరు: రాష్ట్ర రక్షిత కట్టడమైన రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జునరావు కుతాడి అన్నారు. మండలంలోని కటాక్షపూర్‌లోని ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పురావస్తు శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా అర్జున్‌రావు మాట్లాడుతూ భక్తులు, పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలిసేలా సూచిక బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ గోడలపై ఉన్న వైట్‌వాష్‌ను రసాయన శుద్ధిచేసి శిల్పసంపదను భక్తులు స్పష్టంగా చూసేలా చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి కావాల్సిన అంచనాలను తయారుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఉపసంచాలకులు డాక్టర్ నాగరాజు, నర్సింగ్‌నాయక్, సాయి కిరణ్, గందె సంపత్, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, రాజన్న, కమిటీ అధ్యక్షుడు నిమ్మల నాగరాజు, వెంకటేశ్, రాజేందర్, సతీశ్, చిన్ని రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
శాయంపేట: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన మరొకరిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పరకాల ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. శా యంపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారుల ఫిర్యాదు మేరకు శాయంపేట ఐకేపీ సెంటర్ ఇన్‌చార్జ్ బలభద్ర హైమావతిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఎంట్రీలు చేయడానికి ఆమె ఉపయోగించిన ట్యాబ్, ధాన్యం టోకెన్ బుక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. ఆయన వెంట శాయంపేట సీఐ రంజిత్ రావు, ఎస్సై పరమేశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.