
విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
పట్టాభిరామారావు
విద్యారణ్యపురి: విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యా యమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని లష్కర్‌బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివితే ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. బాలికలకు సురక్షిత, ఆరోగ్యకర, సమానమైన భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత అన్నారు. సదస్సులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ విభా గం ఇన్‌చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్, సఖీవన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి.హైమవతి, మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డి.కల్యాణి, హనుమకొండ సీడీపీఓ ఎం.విశ్వజ, భరోసా కేంద్రం ఎస్సై బి.మంగ, పాఠశాల హెచ్‌ఎం ఉమ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.