
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. ఇద్దరి అరెస్ట్
శాయంపేట: మండలంలోని కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పరకాల ఏసీపీ సతీశ్ బాబు, శాయంపేట సీఐ రంజిత్‌రావు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలో తేలిందని పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు కాట్రపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ ట్యాబ్ ఆపరేటర్ వాంకుడోతు చరణ్ నుంచి రూ.20 వేల నగదు, సెల్‌ఫోన్, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ అల్లె అనిత నుంచి ట్యాబ్, టోకెన్ షీట్ బుక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు.