
ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి
● గోపు జైపాల్‌రెడ్డి
దుగ్గొండి: అగ్రకుల పేదలందరూ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు జాతీయ, రాష్ట్రస్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని గిర్నిబావిలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అగ్రకుల పేదలైన రెడ్డి, బ్రహ్మణ, వెలమ, కమ్మ, వైశ్య, మా ర్వాడిలు ఐక్యం కావాలన్నారు. ఈనెల 19న హనుమకొండలో జరగనున్న అగ్రకుల పేదల సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోలి బక్కారెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, కంచరకుంట్ల నర్సింహారెడ్డి, తోకల శ్రీనివాసరెడ్డి, బొమ్మినేని శ్రీనివాసరెడ్డి, తోకల వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.