
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
దుగ్గొండి: విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని పేర్కొన్నారు. గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల విద్యాలయాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, స్టోర్ రూం, కిచెన్ పరిశీలించారు. తరగతుల నిర్వహణ, హాజరు పట్టికలు తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకా రం భోజనం పెడుతున్నారా, కూరలు రుచిగా ఉంటున్నాయా అని అడిగారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్యూలో నిలబడి భోజనం తెచ్చుకుని భోజనం చేశారు. పాఠశాలలోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కరించా లని హెచ్‌ఎం మల్లయ్యను ఆదేశించారు. తరగతి గదిలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబ ట్టారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. బాస్కెట్‌బాల్ కోర్టు కావాలని విద్యార్థులు కోరడంతో వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి పుష్పలత, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
గిర్నిబావిలో ఎంజేపీ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ