
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
సంగెం: విద్యార్థినులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని జీసీడీఓ కె.ఫ్లోరెన్స్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నశముక్తు భారత్ అభియాన్ ఐదో వార్షికోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ దేశభవిష్యత్ విద్యార్థినుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. వైద్యశాఖ డిప్యూటీ డెమో అనిల్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థినులు ఆత్మ నిగ్రహంతో ఉండాలని, చెడు ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండాలన్నారు. అక్షరాస్యత, లింగసమానత్వం సాధిస్తే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే అన్నిరంగాల్లో విజయం వరిస్తుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం గురించి తెలిస్తే 1908, 14446కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం పలు పోటీలు నిర్వహించి విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఎంఈఓ రాము, డాక్టర్ రాకేశ్, ఎస్సై కె.వంశీకృష్ణ, కేజీబీవీ ప్రత్యేకాధికారి నీలిమ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.