
నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి
కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్‌లో నిర్వహించిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ‘ది హైపోథీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేధస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్‌లో 700 మంది అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు సాధించడం నిట్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.