
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దు
● డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఆత్మకూరు: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని సెయింట్ థెరిస్సా హైస్కూల్‌లో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలన్నారు. చదువుతో పాటు ఆటపాటలపై శ్రద్ధ పెట్టాలన్నారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ప్రహసిత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మానసిక సమస్యలుంటే 14416 టెలి మానస్‌కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి ఇక్తాదర్ అహ్మద్, మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన, పాఠశాల హెచ్‌ఎం జాయిస్, సిబ్బంది జునేడి, సంపత్, శ్రీనివాస్, నరేశ్, సునీత తదితరులు పాల్గొన్నారు.