
బీసీ రిజర్వేషన్ల బాధ్యత ప్రభుత్వానిదే
కమలాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అది సాధించే వరకు కొట్లాడుదామని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ ఈటలకు కమలాపూర్ మండలం అంబాల క్రాస్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘ఇవి జరిగే ఎన్నికలు కావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు దసరా దావతులు ఇవ్వొద్దు’ అని ఎంపీ ఈటల చేసిన సూచన మేరకు తాము ఎలాంటి ఖర్చు పెట్టలేదని, తాము కష్టాల పాలు కాకుండా చేసిన ఈటలకు ఆశావహులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారందరికి కలిపితే రూ.కోట్లు మిగిలాయని, దీంతో పోటీ చేయాలనుకున్న ఆశావహులమంతా సంతాషంగా ఉన్నామని ఈటలకు తెలిపారు. అనంతరం కమలాపూర్‌లోని తన నివాసంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఈటల సమావేశమై కాసేపు ముచ్చటించారు. అనంతరం మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను ఈటల పరామర్శించారు.
సాధించే వరకు కొట్లాడుదాం
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్