
ఐలోని మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు
ఆదాయం రూ.20.7 లక్షలు
ఐనవోలు: ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీ లెక్కించారు. 2 ఆగస్టు 2025 నుంచి 10 అక్టోబర్ 2025 వరకు (69 రోజులకు) గాను హుండీలో రూ. 4,37,108, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.16,33,533 రాగా, మొత్తం రూ.20,70,641 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీలో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు డి.అనిల్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ధర్మకర్తలు ఆనందం, కీమా, కుమారస్వామి, నర్సింహారెడ్డి, మహేందర్, కానిస్టేబుళ్లు రమేశ్, రాజు, జి.పరమేశ్వరి, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.