
వీధికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
ఐనవోలు: వీధి కుక్క దాడిలో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ కార్తీక్, దివ్యకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు మూడేళ్ల దేవాన్ష్ గురువారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పిల్లల తల్లి అయిన ఓ వీధికుక్క దేవాన్ష్‌పై దాడి చేసి తలపై తీవ్రంగా గాయపర్చింది. బాలుడిని తల్లిదండ్రులు ముందుగా పీహెచ్‌సీకి తరలించగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.