
కంఠమహేశ్వరుడికి జలాభిషేకం
నర్సంపేట: పట్టణంలో శ్రీకంఠమహేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం స్వామి వారి కి భక్తులు జలాభిషేకం నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతిఒక్కరూ ఆలయానికి డప్పు చప్పుళ్లతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ, జలాలతో అభిషేకాలు చేశారు. పట్టణంలోని గౌడ కులస్తుల ఇంటి నుంచి బిందెలతో జలాలను కొత్త వస్త్రాలు ధరించి మంగళహారతులతో తరలి వచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లుగౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీని వాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్య, ఆర్థిక కార్యదర్శి నాతి సదానందం, గిరగాని కిరణ్, డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

కంఠమహేశ్వరుడికి జలాభిషేకం