
90 రోజుల్లోనే అభివృద్ధి పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: 90 రోజుల్లోనే మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. రేపు(మంగళవారం) మేడారానికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను జిల్లా అధికారులు, పూజారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, జిల్లా ఉన్నతాధికారులతో పాటు సమ్మక్క–సారలమ్మ పూజారులతో మంత్రి సీతక్క ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మేడారం పర్యటనలో అభివృద్ధి ప్రణాళికను సీఎం ఖరారు చేస్తారన్నారు. అనంతరం అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతాయని స్పష్టం చేశారు. మేడారం అభివృద్ధి పనుల్లో 2వేల మంది కార్మికులు పాల్గొనున్నట్లు వివరించారు. ఈ గొప్ప కార్యక్రమానికి అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు.
ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
నర్సంపేట: ఎన్నికల హామీలను విస్మరిస్తున్న పాలక పార్టీలకు ప్రజా ఉద్యమాలతోనే గుణపాఠం చెప్పాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అన్నారు. చెన్నారావుపేట మండలకేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశం ఆదివారం గోర్మియా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు జన్ను రమేశ్, అబ్బదాసి అశోక్, మొర్రి శ్రీను ఎంసీపీఐ(యూ) పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లేకపోగా అప్పుల కుప్పగా మారిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని అందని ద్రాక్షగా మారాయని, గత ప్రభుత్వాల వైఫల్యాలని ఎత్తి చూపుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో ఐక్య ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, మహమ్మద్ రాజాసాహెబ్, శ్రీను, మెతుకుపల్లి రాజిరెడ్డి, అచ్చ, తదితరులు పాల్గొన్నారు.
పండుగపూట అదేకష్టం!
ఖానాపురం: రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేవు. రాత్రి పగలు తేడా లేకుండా బారులుదీరుతున్నారు. ఆదివారం బతుకమ్మ పండుగ రోజు కూడా మహిళలు యూరియా కోసం బారులు తీరారు. మండలంలోని మనుబోతుల గడ్డలో మహిళలు బతుకమ్మ ఆటకు వెళ్లగా యూరియా టోకెన్లు ఇస్తున్నారని తెలుసుకుని చేతిలో ప్లేట్లతో గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లి బారులుదీరారు. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి రైతుల వద్దకు వెళ్లి యూరియా రావడంలేదని చెప్పి ఇంటికి పంపించారు.

90 రోజుల్లోనే అభివృద్ధి పనులు

90 రోజుల్లోనే అభివృద్ధి పనులు