
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
నర్సంపేట/దుగ్గొండి: ఉద్యమకారులకు ఇచ్చి న హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీని వాస్ అన్నారు. ఉద్యమకారుల హక్కుల సాధనకై రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర ఆదివారం చెన్నారావుపేట, దుగ్గొండి మండలం గిర్నిబావికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, రూ.25వేల పింఛన్, బస్సు, ట్రైన్ పాస్‌లను ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, వాటిని వెంటనే ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు ఉప్పునూతల లింగమూర్తి, ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి వీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌడగాని రాజవీరు, సింగారపు సునీల్‌కుమార్, మెడిద లక్ష్మణ్, గణేష్, శీలం రాజు, జిల్లా అధ్యక్షుడు నందగిరి రజినీకాంత్, ఆరె జైపాల్‌రెడ్డి, అండృ శ్రీనివాసరెడ్డి, ఊకంటి గోపాల్‌రెడ్డి, గీకోటి, శ్రీనివాస్, భాస్కర్, రాజు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.