
బతుకమ్మ సంబురం
– మరిన్ని ఫొటోలు 11లోu
మొదలైన ఎంగిలిపూల వేడుక
జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు ఆటపాటలతో మార్మోగిన పల్లెలు
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబురం మొదలైంది. ఆదివారం జిల్లావ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలు తొలిరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతీ వీధి.. బతుకమ్మ వేడుకలతో సందడిగా మారింది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఉదయం నుంచే ఇళ్లలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను ప్రతిష్ఠించారు. సాయంత్రం మహిళలు, చిన్నారులు బతుకమ్మలతో ఆయా గ్రామాల్లోని దేవాలయాలు, చెరువు కట్టల వద్ద బతుకమ్మలతో ఆడిపాడారు. ముత్తయిదువలు పసుపు, కుంకుమలు, వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఫలహారాలతో గౌరమ్మకు నైవేద్యం సమర్పించారు. నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు బతుకమ్మ ఏర్పాట్లు చేయగా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య, పితృ(పెత్తర) అమావాస్యగా భావించి పలువురు తమ పితృదేవతల పేరున పూజారులకు బియ్యం ఇచ్చారు. – సాక్షి నెట్‌వర్క్

బతుకమ్మ సంబురం