
అభివృద్ధిలో నందనం సొసైటీ
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు
హన్మకొండ: నందనం రైతు సేవా సహకార సంఘం అభివృద్ధిలో ఉందని ఆ సంఘం, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో నందనం రైతు సేవా సహకార సంఘం పాలకవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో సంఘం లావాదేవీలు, కర్షకమిత్ర, పంట రుణాలు, బంగారు రుణాలు, ధాన్యం కొనుగోళ్లు, యూరియా బస్తాల పంపిణీపై సమీక్షించారు. పంట రుణాల పంపిణీ, వసూళ్లకే కాకుండా వివిధ వ్యాపారాల ద్వారా సంఘం ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో నందనం రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్‌రావు, డైరెక్టర్లు రాజారపు కుమార్, బిర్రు పద్మ, కలకోట ఎలేంద్ర, చింత బాబు, మోటె చిరంజీవి, మాదారపు సంపత్ రావు, పూజారి రామచందర్, బుచ్చి రెడ్డి, మారిపల్లి యేసోబు, సీఈఓ సంపత్ పాల్గొన్నారు.